ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశాారు. రాష్ట్రం విభజన జరిగే సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేంద్రం హమీ ఇచ్చిందని తెలిపారు.
మీరు ఎగ్ ప్రియులా రోజు ఎగ్స్ ఆహారంలో భాగంగా స్వీకరిస్తారా? అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఎగ్స్ హోల్ సేల్ ధరలకు తెచ్చుకోండి. ఎందుకంటే ప్రస్తుతం కోడిగుడ్ల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఎగ్ రిటైల్ మార్కెట్లో 7 రూపాయలకు సేల్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఏపీలో అంగన్వాడీలు వర్కర్లు సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేయనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే హామాలను నెరవేర్చలేని తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి.
11 మంది సిట్టింగులను వైసీపీ మార్చింది. వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల గెలవాలని.. అందుకోసమే మారుస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒకరిద్దరూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
జనసేన నేత నాదెండ్ల మనోహర్ విశాఖలోని టైకూన్ జంక్షన్ కి వెళ్లకుడదని చెప్ప పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో తీవ్రపరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
నేడు కార్తీకమాసం చివరి సోమవారం. దీంతో ప్రముఖ శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.
అనకాపల్లిలో రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగం సంఘ అధ్వర్యంలో నిన్న జరిగిన ఆత్మ గౌరవసభలో.. సీపీఎస్ ఉద్యోగులు జగన్ నువ్వు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. జగన్ ఇచ్చిన హామీ మరిచారని మరోసారి పలు రకాలుగా ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
విశాఖలో నేవీ డే విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారత నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యం ఈ విన్యాసాలను చేపట్టింది.
ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో వంటి ఎలాంటి తీవ్రమైన వ్యాధులకైనా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో జనవరి నెలలో 50 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను కూడా ఆయన త్వరలో నియమిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు జోరుగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలని ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో పర్యటించిన క్రమంలో కీలక విషయం ప్రకటించారు. కొత్త వలస రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మార్చబోతున్నట్లు చెప్పారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. శనివారం జమ్ములపాలెంలో పర్యటించిన క్రమంలో చంద్రబాబు తుపాను బాధిత రైతుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలను నిన్న పర్యటించారు. పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే సీఎం బాధ్యతరహితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని జగన్‌పై మండిపడ్డారు.