»Chandrababus Key Announcement First List In January With 50 People
Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన..50 మందితో జనవరిలో తొలి జాబితా!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో జనవరి నెలలో 50 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను కూడా ఆయన త్వరలో నియమిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. జనవరిలో తొలి విడత అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం గ్రూపు గొడవలు లేని స్థానాలపై దృష్టిపెట్టినట్లుగా టీడీపీ వర్గాల సమాచారం. 2024 ఎన్నికల కోసం ఏపీలోని నేతలు ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలోనే ఓటర్ల జాబితాపై అన్ని పార్టీలు పెదవి విరుస్తున్నారు.
ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల పంటల నష్టంపై అన్ని పార్టీలు అధికార పార్టీ అయిన వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్లలోని తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఇటువంటి పరిస్థితిలో నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోకుండా తుఫాను బాధితుల కోసం, పంటలు నష్టపోయిన రైతుల కోసం పోరాటం చేయాలన్నారు.
2024 ఎన్నికలే టార్గెట్‌గా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలు గ్రౌండ్ లెవల్లో యాక్టివ్ అయ్యాయి. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్ తమ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై తామిద్దరం చూసుకుంటామని గతంలో పవన్ కూడా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులను చంద్రబాబు అప్రమత్తం చేశారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల నియామకాలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. జనవరి నెలలో 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు చంద్రబాబు తమ నాయకులకు స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువయ్యిందనే చెప్పాలి. బీజేపీ కూడా వైసీపీపై విమర్శలు చేస్తూ తమ వైఖరిని చాటుకుంటోంది.