సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. అలాగే నేడు 'తెలుగు సేన పార్టీ' అనే పేరుతో ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి కూడా కొత్త పార్టీని స్థాపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
తిరుమలకు భక్తులు బారులు తీరారు. రేపు వైకుంఠ ఏకాదశి కావడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో విషాదం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 19 ఏళ్ల శిల్ప శిల్పకు రెండు నెలల క్రితం వెంకటేష్ అనే వ్యక్తితో వివాహం కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ క్రమంలోనే ఆమెను భర్త హతమార్చాడని బంధువుల ఆరోపణ భర్త వెంకటేష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న యువతి బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అమరావతిలో రైతులు సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు దానిని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఏపీలో వాలంటీర్ల జీతాన్ని జనవరి నెల నుంచి పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతాన్ని రూ.750లు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.
ఓ జంటకు పెళ్లైంది. కానీ వారం రోజులు గడువక ముందే మృత్యువాత చెందారు. అయితే ఈ జంట ఎందుకు అలా చేశారు? అసలు ఏం జరిగింది అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనికి ప్రధాని, మంత్రులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలవరపెడుతోంది. చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
యువగళం పాదయాత్ర అనేది జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ని ఇంటికి పంపించి టీడీపీ, జనసేన సర్కార్‌ను ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్ర అప్పులు పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని.. మొత్తం 168 శాతం పెరిగాయని లెక్కలతో సహా వివరించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 33 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లుగా వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. నేడు టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువగళం నవశకం సభకు కూడా పవన్ రాకపోవచ్చని జనసేన వర్గాల సమాచారం.
రాబోవు ఎన్నికలో తనకు వైసీపీ టికెట్ ఇవ్వదంటూ కొంత మంది శునకానందంతో ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి రోజా అన్నారు.