The couple jumped into the Godari after five days of marriage at penugonda
పెళ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఏం జరిగిందో ఏమో కానీ కొత్తగా పెళ్లయిన జంట నదిలో దూకి బలవంతంగా చనిపోవాలని ప్రయత్నించింది. ప్రాణభయంతో భర్త ఈదుకుంటూ బయటకు వెళ్లాడు. కానీ వధువు మాత్రం గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఉద్రజవరం మండలం మోర్తకు చెందిన కె.శివకృష్ణకు వడలికి చెందిన కోదాడ సత్యవాణితో ఈనెల 15న వివాహమైంది. నూతన వధూవరులు మంగళవారం రాత్రి సినిమాకు వెళ్తున్నామని చెప్పి బైక్పై బయటకు వెళ్లారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ పెనుగొండ(penugonda) మండలం సిద్ధాంత వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. అయితే వరుడు ఈత కొడుతూ బయటకు రాగా, వధువు(19) గల్లంతైంది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. తణుకులోని ప్రవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ నాటకీయంగా వ్యవహరిస్తున్నారని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.