వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పది రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకూ వైకుంఠ దర్శనం ఉంటుందని వెల్లడించింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేరుస్తానన్న సీఎం జగన్ అన్ని హామీలను గాలికొదిలేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా సీఎం జగన్‌కి తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.
వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 3 వేలకు పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచడాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని నేటి ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
రెండు కార్లు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఈ ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు. మరోవైపు డ్రైవర్, పీఏకు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్ని ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సాబ్జీ అంగన్ వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ చో...
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తుందని సీఎం జగన్ అన్న సంగతి తెలిసిందే. ఓటమి భయం కారణంగానే ఇలా అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి జోస్యం చెప్పారు.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందు వల్ల ముందుగానే పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
పలాస బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క కంటే జనసేన పార్టీకి తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్యాకేజీ స్టార్ డైలాగులు వైసీపీని ఏం చేయలేవని అన్నారు.
లోక్‌సభలో స్మోక్‌గ్యాస్ చల్లి భయాందోళనలు సృష్టించిన నిందితులను పట్టుకున్న ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నమయ్యలో నిరసన శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరించారు.
ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే నెల 17వ తేదిక సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నిరుద్యోగంలో టాప్‌లో ఏపీ ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలోని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు పాటించడం లేదని ఈ మేరకు వెల్లడించింది. అంతేకాదు పిటిషనర్లకు రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో యుడవలి వారి సత్రాన్ని ఆక్రమించుకున్నారని ఎటువంటి లీజు చెల్లించకుండా స్కూల్ నిర్వహిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్...