»Key Decision Of Ap Sarkar Pension Increased To Rs 3000
Andhrapradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..పెన్షన్ రూ.3000కు పెంపు
వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 3 వేలకు పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచడాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ రూ.3 వేలకు పెంచడానికి నేడు ఏపీ కేబినెట్ (AP Cabinet ) ఆమోదం తెలిపింది. సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2750 నుంచి రూ.3000కు పెంచినట్లు తెలిపింది. అలాగే ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని కూడా రూ.25 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది.
జనవరి నెలలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు చేసేందుకు కూడా ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలె సంభవించిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. తుఫాన్ వల్ల కలిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయక చర్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమాచారాన్ని కేంద్ర బృందం సేకరించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో సమావేశమై తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.