»Ts High Court Telangana High Court Notices To Cm Jagan
TS High Court: సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా సీఎం జగన్‌కి తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.
TS High Court: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలంటూ జోగయ్య తెలిపారు. ఎలాంటి నేర చరిత్ర లేని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని అతను పేర్కొన్నారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఎన్నికై జగన్ సీఎం అయ్యారని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనుమతిస్తే వ్యక్తిగతంగా నోటీసులు అందజేస్తానని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కోర్టు జారీ చేసిన నోటీసులు అందకపోవడంతో మరోసారి జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకున్న పిటిషన్‌తో పాటు మూడు నెలల తర్వాత విచారణ చేపడతామని వాయిదా వేసింది.