»Anganwadi Centers Closed Across Ap Strike From Today
Andhrapradesh: ఏపీ వ్యాప్తంగా మూతబడిన అంగన్వాడీ కేంద్రాలు..నేటి నుంచి సమ్మె!
ఏపీలో అంగన్వాడీలు వర్కర్లు సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేయనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే హామాలను నెరవేర్చలేని తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో నేటి నుంచి అంగన్వాడీలు సమ్మె (Anganwadi strike) చేపట్టనున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి హామీ లభించకపోవడంతో అంగన్వాడీలు ఆందోళన చేసేందుకు సిద్దమయ్యారు. నిన్న విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై వారు చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని అంగన్వాడీ ప్రధాన సంఘాలు ప్రకటన చేశాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు (ICDS Project) కార్యాలయాలతో పాటుగా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టేందుకు అంగన్వాడీ కేంద్రాలు సిద్దమయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు, నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు పరిష్కరించనందుకు మంగళవారం రోజు నుంచి మూకుమ్మడిగా సమ్మెబాటపట్టనున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్లు వెల్లడించాయి.
అయితే 8వ తేది నుంచే తాము సమ్మెలోకి వెళ్తున్నట్లుగా అంగన్వాడీ యూనియన్లు (Anganwadi Unions) ఇదివరకే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. తుఫాను కారణంగా ఆ సమ్మెను 12వ తేదికి వాయిదా వేశాయి. దీంతో సోమవారం రాత్రి 10 గంటల వరకూ యూనియర్లు ప్రభుత్వంలో సుదీర్ఘ చర్చలు జరిపినా ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వకపోవంతో నేటి నుంచి సమ్మె చేయనున్నట్లు తెలిపాయి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీని అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలకు పెంచాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.