YSRCP కీలక నిర్ణయం.. 11 అసెంబ్లీ ఇంచార్జీల మార్పు, ఎందుకంటే..?
11 మంది సిట్టింగులను వైసీపీ మార్చింది. వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల గెలవాలని.. అందుకోసమే మారుస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒకరిద్దరూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
YSRCP: ఏపీలో అధికార వైసీపీ (YSRCP) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో సిట్టింగుల మార్పు ప్రక్రియ మొదలు పెట్టింది. తొలి విడతలో 11 మందిని సిట్టింగులను మార్చింది. దీంతో ఒకరిద్దరూ పార్టీ, ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియా ముందుకు మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చారు. ఎందుకు సిట్టింగులను మార్చాల్సి వచ్చిందో వివరించారు.
స్థాన చలనం కలిగిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు. సిట్టింగులను మార్చిన చోట వీరు బరిలోకి దిగుతారు. గుంటూరు పశ్చిమ విడదల రజని, మంగళగిరి నుంచి గంజి చిరంజీవి ఉంటారు. ఆయన పేరు ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. పత్తిపాడు బాలసాని కిషోర్ కుమార్, వేమూరు- అశోక్ బాబు, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున
తాడికొండ-మేకతోటి సుచరిత, కొండెపి- ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేట- రాజేశ్ నాయుడు, అద్దంకి-పాణెం హనిమిరెడ్డి, రేపల్లె-ఈవూరు గణేశ్, గాజువాక- వరికూటి రామచంద్రరావును నియమించింది. 175 చోట్ల విజయం సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకే టికెట్లు ఇచ్చి ఓడిపోయింది. అందుకే సీఎం జగన్.. సిట్టింగులను మార్చారు. దాదాపు 40, 50 మంది వరకు మార్చే అవకాశం ఉంది. తొలి విడతలో 11 మందిని మార్చేశారు.