KRNL: ఆదోని మండలం పెద్ద హరివాణం సిఐటియు కార్యాలయంలో ఆశా వర్కర్‌ల జనరల్ బాడీ సమావేశం లతా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్‌ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. శివలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డిలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు.
కడప: ఖాజీపేటకు చెందిన మాజీ ఎంపీటీసీ బి.కరీముల్లా కుమార్తె వివాహ వేడుక ఆదివారం మైదుకూరు కె.ఎస్.సి ఫంక్షన్ హల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు డియల్ రవీంద్రారెడ్డి, డి.యల్ సుభద్రమ్మ సతీసమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
AKP: నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సుర్ల కన్నయ్య నాయుడుతో పాటు మరికొంత మంది ఆదివారం స్పీకర్ తనయుడు, నర్సీపట్నం వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. కన్నయ్య నాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు.
ELR: టి నరసాపురం మండలంలోని బంధంచర్ల గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం పర్యటన చేశారు. ఈ పర్యటనలో అంబేద్కర్, డా. బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా నాగరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
బాపట్ల: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య మరియు టిడిపి నాయకులు ఏల్చూరి శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న నాయకులు మృతదేహంపై పూ లమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్య లకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే శ్రీనివాసరావు మృతి చెందడం బాధాకరమని వారు అన్నారు.
KRNL: కర్నూలుకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును టీడీపీ మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదివారం కలిశారు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్, బసలదొడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, దుద్ది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పెండింగ్ నిధులు రూ.4.27 కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరారు. నిధుల విడుదలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు.
PLD: మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం జమ్మలమడుగు గ్రామంలోని 224 మంది డ్వాక్రా సంఘ సభ్యులకు మంజూరైన రూ.3.47 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ద్వారా మహిళలకు మంచి జరగుతుందని ఆకాంక్షించారు.
VZM: ఎస్.కోట పట్టణంలో ఓ ప్రైవేటు హాల్లో ఓటరు అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకులు దొడ్డి సూర్యారావు, వేదిక ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ.. అక్టోబర్ 3వతేదీ నుంచి జరగనున్న మూడవ గ్రామసభ నిర్వహణకు తగు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వినతి పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి రాయడం జరిగిందన్నారు.
AKP: చోడవరం నడిబొడ్డున ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం చోరీ జరిగింది. పట్టపగలే బాబా వెండి కిరీటంతో పాటు సింహం బొమ్మకు అలంకరించిన వెండి తాపడంలోని కొతభాగాన్ని దొంగలు పట్టుకుపోయారు. ప్రేమ సమాజానికి ఆనుకుని ఉన్న ఈ ఆలయంలో సుమారు రూ.లక్ష విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురి కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
ATP: గుంతకల్‌కు విచ్చేసిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను బీరప్ప దేవాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ నాయకులు కలిశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కోశాధికారి వినోద్, వెంకట్ నాయక్, అఖిల్ పాల్గొన్నారు.
SKLM: పొందూరు మండలం వావిలపల్లి పేట గ్రామానికి చెందిన శ్రీకాకుళం జిల్లా శ్రీశ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శి వావిలపల్లి రాజారావు మాస్టర్ ను ఆదివారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శ్రీ మద్దభగవద్గీత విశ్లేషణాత్మక గ్రంధ ఆవిష్కరణలో కార్యక్రమంలో భాగంగా ఆయనకు దుస్సాలువ, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు.
AKP: రోలుగుంట మండలం ఎంకె.పట్నం పంచాయతీ శివారు కొరుప్రోలు పీవీటీజీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అక్కడి ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఏపీ ఆదివాసి ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.గోవిందరావు మాట్లాడుతూ… గ్రామంలో 10 కుటుంబాలు 10 మంది జనాభా జీవిస్తున్నాయన్నారు. రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మన్యం: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లు నష్టపోయిన వారు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలకు నష్టపోయిన ఇల్లు, ఇతర వివరాలను ఇప్పటికే సంబంధిత అధికారుల ద్వారా సేకరించి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
VZM: జామి మండలం అలమండ హైస్కూల్ లో 1997, 98 సంవత్సరంలో 10వ, తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తనతో పాటు చదివిన తోటి స్నేహితుడు కొమ్ము ప్రసాద్ ఇటివల గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయాడు. ఈ విషయం తెలుసుకొన్న తోటి స్నేహితులు మేము సైతం అంటూ చనిపోయిన తోటి స్నేహితుడు కుటుంబానికి ఇతర విద్యార్థులు ద్వారా సేకరించిన సుమారు 28వేల రూపాయలు ఆదివారం అతని కుటుంబానికి అందజేశారు.
KKD: ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కూటమి శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం” పోస్టర్, స్టిక్కర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.