చంద్రబాబు నాయుడుకు గుండె సంబంధిత సమస్య ఉందని అతని తరఫు లాయర్లు ఏపీ హైకోర్టుకు తెలిపారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు.
వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదని, గత పాలకులు ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. రూ.340 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవికి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు.
హిందూపురంలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. దాదాపు 10 నెలల తర్వాత బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే వైసీపీ నేతలు బస్సు యాత్రను చేపట్టనున్నారు.
జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పార్టీ వ్యవహార ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ఆరోపించారు. ఢిల్లీలో 5 కంపెనీలపై ఈడీ దాడి చేసిందని అవి ఏపీకి విద్యా కానుక కిట్లు సరఫరా చేసేవేనని పేర్కొన్నారు. నాసిరమైన షూలు, బ్యాగులు పంపిణీ చేసి విద్యార్థులకు కేటాయించిన నిధులకు గండీ కొట్టారని మండిపడ్డారు.
టీటీడీ పాలక మండలి నేడు సమావేశమైంది. ఈ సందర్బంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్లు వెల్లడించింది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. దీంతో భక్తుల్లో టెన్షన్ మొదలైంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ కనిపించలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో చర్యలు చేపట్టామని, భక్తులను గుంపులు గుంపులుగా నడకమార్గంలో పంపుతున్నట్లు టీటీడీ వెల్లడించింది.
బెట్టింగ్‌కు టెకీ గంగిరెడ్డి బలయ్యాడు. పందెం వేసి రూ.40 లక్షల అప్పు చేశాడు. అది తీర్చలేక.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ కి ఆరోగ్య నెట్‌వర్క్ ఆసుపత్రులు లేఖ రాశాయి. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 27 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సేవలు నిలిపివేస్తామని హాస్పిటల్స్ తేల్చిచెప్పాయి. రూ.1000 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆసుపత్రులు పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంయుక్త మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చనున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు. వాటిలో టీడీపీ నుంచి 6, జనసేన నుంచి 5 ప్రతిపాదనలు స్వీకరించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెలవులు వచ్చిన క్రమంలో సరదాగా ఎనిమిది మంది యువకులు కీసర మున్నేరు వాగులో ఈతకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతు కాగా..వారిలో ముగ్గురు మృత్యావాత చెందారు.
మద్యం ఇవ్వలేదని వైన్ షాపునకు నిప్పుపెట్టాడు మధు అనే వ్యక్తి. విశాఖ పట్టణంలో ఈ ఘటన జరగగా.. నిందితుడు మధును పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళలకు ఏపీ సర్కార్ రూ.లక్షన్నర వరకూ సాయం అందించనుంది. మహిళా శక్తి స్కీమ్ ద్వారా ఈ రుణాన్ని అందించి వారి ఆర్థిక ఆదాయ పెరుగుదలకు ఆటోలను ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా 660 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరూ కాలింగ్ బెల్ కొట్టినా వారెవరో తెలుసుకుని తలుపులు తీయాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.