ATP: కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఎన్నో పథకాలు మార్పులు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని 18వ వార్డులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా వారు ఇంటింటికి తిరుగుతూ.. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.