NLR: వరికుంటపాడులో ఈ నెల 25న ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరుగుతుందని టీడీపీ మండల కన్వీనర్ మధుసూధన్ రావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ హాజరవుతారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.