SKLM: పర్యావరణ హితం కోరుతూ చెట్లను కాపాడండి అనే నినాదంతో ఓ యువకుడు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కె.పాలవలస గ్రామానికి చెందిన కొట్టెడ హరికృష్ణ చీపురుపల్లి నుంచి నేపాల్‌కు యాత్రను ప్రారంభించాడు. నరసన్నపేట మండలంలోని జమ్ము కూడలి వద్దకు చేరుకున్న యువకుడు మీడియాతో మాట్లాడాడు.