E.G: తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని జనసేన నేత, పి.గన్నవరం నియోజకవర్గం సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, జనసేన మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఆదివారం మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం అపఖ్యాతిపాలు చేసిందన్నారు. లడ్డూ వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.