E.G: అనపర్తి నియోజకవర్గాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిక్కవోలు మండలం కొమరిపాలెంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మంచిని వివరించారు.
NLR: రాష్ట్ర ప్రభుత్వం చిరు ఉద్యోగులు, కార్మికుల పట్ల అణచివేత ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. గూడూరు సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం చిల్లకూరు మండల సమన్వయ కమిటీ ఇంద్రావతి అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా విధానాలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
SKLM: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన ధాన్యానికి 48గంటల్లో బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
VSP: దసరా సెలవులలో పర్యాటకుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 5 నుండి 15 వరకు విశాఖ-అరకు-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు(08525-08526) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-అరకు(08525) రైలు విశాఖలో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు అరకు చేరుతుంది. తిరుగు ప్రయాణం అరకు-విశాఖ(08526) రైలు మధ్యాహ్నం 2 గంటలకు అరకు లో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుందని అధికారులు వెల్లడించారు.
SRKL: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయా ఆదాయ వివరాలను ఆదివారం ఈవో రమేష్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారని తెలిపారు. స్వామికి టికెట్లు రూపేనా రూ.1,08,000, పూజలు విరాళాల రూపంలో రూ.72,830 లు, ప్రసాదాల ద్వారా రూ.1,64,030లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
BPT: వేమూరు మండలం చావలి గ్రామంలో ఆదివారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆనందబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. రానున్న రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీల అమలుకు కృషి చేస్తామని అన్నారు.
E.G: రామచంద్రపురంలోని విఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 24వ తేదీన మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నారు. టెన్త్ నుంచి ఆపైన చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. పలు ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
PLD: అంగన్వాడీ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడుగు గ్రామంలో నిర్వహించిన సామూహిక సీమంతల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆహార నాణ్యతలో రాజీ పడొద్దు అని సూచించారు.
అన్నమయ్య: అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఆదివారం చిట్వేలి మండలం కే కందుల వారిపల్లి గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు. వంద రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని ప్రజలకు వివరించారు. అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు.
ATP: గోరంట్ల మండలం శివాలయం కాలనీలో టీడీపీ అధికారంలోకి వస్తే సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తానని ఆ పార్టీ నాయకుడు వెంకటరామప్ప హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నెల క్రితం మంత్రి సవిత చేతుల మీదుగా భూమి పూజ చేశారు. సీసీ రోడ్డు పనులు పూర్తి కాగా ఆదివారం ప్రారంభించారు. మంత్రి సవిత పాల్గొని సీసీ రోడ్డును ప్రారంభించి, వెంకటరామప్పను అభినందించారు.
PLD: వినుకొండ పట్టణం 11,12వ వార్డుల్లో ఆదివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన పథకాల గురించి వివరించారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి గోడలకు స్టికర్లు అంటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పొల్గొన్నారు.
SKLM: ప్రధాన మంత్రి పిలుపు మేరకు”స్వచ్ఛత హి సేవ”కార్యక్రమం నిర్వహించామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్య కిరణ్ తెలిపారు.ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు,మానవ హారాలు,మొక్కలు నాటే కార్యక్రమం,పరిసరాలు పరి శుభ్రపరచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ వెంకట తిలక్, లీడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం పంచాయతీ ఆచారి కాలనీలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఆవరణలో ఆదివారం అభిలాష్ నేత్ర వైద్యశాల డా.యస్. గురుమూర్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.
VSP: క్రీడాకారులను తగిన విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. వైజాగ్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనేందుకు కె.ఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ స్టార్ హోటల్‌లో నిర్వహించిన క్రికెట్ టీమ్స్ వేలం కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
శ్రీకాకుళం: జిల్లాలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం హైకోర్టు జడ్జి సత్తి సుబ్బారెడ్డి సతిసమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో సౌర హోమం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, వారికి స్వామి ప్రసాదాలన జ్ఞాపికను బహుకరించారు.