తెలంగాణలో ఎన్నికలు ఉన్న క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆంధ్రా అభివృద్ధి గురించి మాట్లాడటం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) స్పష్టం చేశారు. అంతేకాదు మీరు మీ ప్రాంతంలో చేసిన పనులు గురించి చెప్పుకోవాలని హితవు పలికారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమగ్ర కుల గణన చేపడతామని.. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి గ్రూప్-1 జాబ్ ఇస్తామని ప్రకటించింది.
తిరుమల తిరుపతిలో ఇటివల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 10 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అందుకోసం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా..టిక్కెట్లును కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్‌పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ వద్ద పలువురు అభిమానులు వారితో ఫోటోలు దిగారు.
ఏపీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చింది.
వేగంగా వెళ్తున్న కారు ఆకస్మాత్తుగా అదుపుతప్పి ఢీవైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీబీఐ కేసు నమోదైంది.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌పై విడుదల కావటం పట్ల సినీనటి జయప్రద (Jayaprada) సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచిందన్నారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబుకు ఉపశమనం లభించిందని ఆమె అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు కల్తీ మద్యం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో వేలమంది వాళ్ల ఆసుపత్రి పాలై వాళ్ల ప్రాణాలను పొగొట్టుకున్నారని ఆరోపించారు.
మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన కుటుంబీకుల ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. తన సతీమణి భువనేశ్వరి కన్నీళ్లను చూసి తాను కూడా కంటతడి పెట్టుకున్నారు. కాగా నేడు ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి సాయంత్రం చేరుకోనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. సరిగ్గా 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల గురించి చాలా మంది పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.
రేపు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా అసలు ఏపీ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది. అందుకోసం ప్రధానంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? ఇదే రోజున ఇంకేదైనా రాష్ట్రాలు ఏర్పడ్డాయా అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
రాజమండ్రి జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల అవ్వడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ప్రపంచంలోని తెలుగువారందరికీ బాబు ధన్యవాదాలు తెలియజేశారు.
మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయన్ని ఏ3గా చేర్చుతూ సీఐడీ కేసు ఫైల్ చేసింది. ఏ1గా నరేష్, ఏ2గా కొల్లు రవీంద్రను చేర్చుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.