»Chandrababu Will Go To Delhi Tomorrow Hearing In The Supreme Court On 28th
Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు..ఎల్లుండి సుప్రీంలో విచారణ
నవంబర్ 28న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సాగనుంది. ఈ తరుణంలో ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు బాబు హాజరుకానున్నారు.
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)కు స్కిల్ స్కామ్ కేసు (skill Developement scam case)లో రెగ్యులర్ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కంటి ఆపరేషన్ చేసుకుని ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) కుమారుడి పెళ్లి రిసెప్షన్ సోమవారం ఢిల్లీలో జరగనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు.
చంద్రబాబుతో పాటుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswary) కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం బాబు హైదరాబాద్ (Hyderabad)లోని తన నివాసంలోనే ఉంటున్నారు. సోమవారం ఆయన ఢిల్లీకి వెళ్లి రిసెప్షన్ కు హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం ఢిల్లీ (Delhi) నుంచి బయల్దేరి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
ఇదిలా ఉండగా స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి హైకోర్టు బాబుకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. బాబుకు బెయిల్ రద్దు చేయాలని కోరింది. అయితే దీనిపై మంగళవారం నవంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)ను కూడా రేపటి నుంచి నారా లోకేష్ (Nara Lokesh) ప్రారంభించనున్నారు. ఈ యువగళం పాదయాత్ర సందర్భంగా చేపట్టే సభకు బాబు హాజరయ్యే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.