»Cement Lorry Overturns In Alluri District Five Killed
Road Accident: అల్లూరి జిల్లాలో సిమెంట్ లారీ బోల్తా..ఐదుగురు దుర్మరణం
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా (Alluri District)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈ విషాద ఘటన జరగ్గా ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం (5 died) చెందారు. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసుల వివరాల మేరకు.. అల్లూరి జిల్లా ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
హంతల్‌గూడ ఘాట్ రోడ్డుపై సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ (cement Load Lorry) బోల్తా పడింది. ఆ లారీ చిత్రకొండ నుంచి జడంబో వరకూ సిమెంట్ లోడ్‌తో వెళ్తోంది. ఆ సమయంలో లారీ బోల్తా పడటంతో ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనలో మరో 10 మందికి తీవ్రంగా గాయాలు (10 members injured) అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయాలపాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.