»Nara Lokesh Said That Ap Cm Jagan Will Go To Jail Again
Nara Lokesh: జగన్ ఖైదీ డ్రెస్ రెడీ చేసుకో
ఏపీ సీఎం జగన్ మరో సారి జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందని టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పుడుతున్నారని ఆరోపించారు. తనకు ఇది వరకు కేటాయించిన జైలు దుస్తులను ఉతికించి పెట్టుకొమ్మని సూచించారు.
Nara Lokesh said that AP CM Jagan will go to jail again
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణల కేసుల్లో చంద్రబాబు (Chandrababu) జైలుకు వెళ్లిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం హీటెక్కింది. టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ (Jagan)పై తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని, అవినీతి చక్రవర్తి జగన్ త్వరలో జైలుకు వెళతారని లోకేశ్ (Lokesh) పేర్కొన్నారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జగన్ జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందని, అవినీతి చక్రవర్తి జగన్ తన 6093 నెంబర్ ఖైదీ డ్రెస్ ఉతికి శుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. జగన్‌తో పాటు సీబీఐకి రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ లోకేశ్ తాజాగా జగన్‌పై విమర్శలు చేశారు. ఇన్నేళ్లుగా అన్ని కేసులను మేనేజ్ చేస్తూ వచ్చారని, దొంగ సొమ్ముతో ఇంకెన్ని రోజులు మభ్యపెడుతారని అన్నారు. త్వరలో జగన్ ఊచలు లెక్కపెడుతాడని లోకేశ్ పేర్కొన్నారు.