Local Boy Nani: వైజాగ్ హార్బర్ ప్రమాదంలో 30 బోట్లు కాలిపోయిన సంగతి తెలిసిందే. లోకల్ బాయ్ నాని (Local Boy Nani) వల్లే ప్రమాదం జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై నాని స్పందించారు. ప్రమాదంతో తనకు ఏ సంబంధం లేదని చెప్పారు. దయచేసి తనను ఇబ్బందికి గురి చేయొద్దని కోరాడు. తన లాయర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చాడు.
హార్బర్ ప్రమాదం జరిగిన సమయంలో తాను హోటల్లో ఉన్నానని నాని (nani) చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయాలని పోలీసులను కోరగా.. వారు పరిశీలించారని వివరించారు. అందులో తాను ఉండటం చూసి.. సంబంధం లేదని వారే చెప్పారని పేర్కొన్నారు. కానీ తనను 4 రోజులు పోలీసు స్టేషన్లో ఉంచారని వాపోయాడు. ప్రమాదం ఇష్యూలో అందరూ తనను టార్గెట్ చేశారని నిట్టూర్చాడు. ఎందుకు ఇలా జరిగిందో తనకు తెలియదన్నారు.
కొందరు గంగపుత్ర సోదరులు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన జీవితం నాశనం చేయొద్దని మత్య్సకారులకు, యూట్యూబర్లకు దండం పెట్టి చెప్పారు. మిగతా వారితో కలిసి మంటలను ఆర్పేందుకు సాయం చేశానని చెప్పారు. అలాగే రాజకీయాలతో తనకు సంబంధం లేదని నాని స్పష్టంచేశాడు. నచ్చిన పార్టీ, అభ్యర్థికి ఓటు వేస్తానని చెప్పారు. నిజ నిజాలను వెలికితీసి తనను కాపాడాలని పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశాడు.