విశాఖ రాజధాని, త్వరలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ మరోసారి తెలిపారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని.. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని జగన్ అన్నారు.
Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ నుంచి విడిపోతున్నట్లు గుమ్మనూరు జయరాం పక్రటించారు. అలాగే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. ఎంపీగా పోటీ చేయమని హైకమాండ్ ఆదేశించింది. దీంతో జయరాం పార్టీ నుంచి వీడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలో టీడీపీ ఆధ్యర్యంలో జయహో బీసీ సభ నిర్వహిస...
టీడీపీ, జనసేన స్వార్థం కోసం కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది అభివృద్ధో? ఏది దోపిడినో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పెనుకొండ సభలో తెలిపారు.
టీడీపీతో పొత్తు పెట్టుకొని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసైనికులను నిండా ముంచాడు అని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఇక ఆయన్ను జనసైనికులే రక్షించుకోవాలి అని వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో వైసీపీ ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్‌కు ఓటమి తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఓ యువకుడుని కెమెరా కోసం హత్య ఇద్దరు యువకులు హత్య చేశారు.
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు.
జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. చేగొండి సూర్యప్రకాష్ పార్టీని వీడారు. ఆయన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తనయుడు.
తాడేపల్లి గూడెంలో జరిగిన సభలో పవన్, చంద్రబాబు చాలా దిగజారుడు తనంగా మాట్లాడారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు.
టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు. వ్యవస్థలను ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ.. టీడీపీ నేతలను వేధిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ఓడరేవులో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
సీనియర్ నేత హరిరామజోగయ్య పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. జనసేన మంచికోసం చెప్తే తననే వైసీపీ కోవర్టు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే లేఖలు రాసిన ఈయన తనకు సలహాలు ఇవ్వద్దని పవన్ కల్యాణ్ చెప్పిన తరువాత మళ్లీ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్నారు.