Lakshmi Parvathi : తాడేపల్లి గూడెంలో జరిగిన సభలో పవన్, చంద్రబాబు చాలా దిగజారుడు తనంగా మాట్లాడారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. పవన్ మీరు అస్సలు చదువుకున్నారా.. చాలా అసహ్యంగా మాట్లాడారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు భయంకరంగా తిట్టే వాడు.. ఇప్పుడేమో పొగుడుతున్నాడు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ చేతకానివాడు.. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా కేడర్ ని తయారు చేసుకోలేకపోయాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. పవన్ చంద్రబాబుకి ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ లాంటి వాడు. కాపు జాతి కోసం ఒక్క రూపాయి అయిన ఖర్చు పెట్టారా… మొన్న మీటింగ్లో జనసేన జెండా కనిపిస్తే చంద్రబాబు పక్కకు తీసేయమన్నాడు.. ఆ సందర్భంలో పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోలేదు.
చంద్రబాబు దగ్గర ఎందుకు అంత బలహీనతగా తయారయ్యావు. కేవలం 24 సీట్లు తీసుకున్నావు. నీకు సిగ్గు లేదా.. నిన్ను చూసి కాపులు సిగ్గు పడుతున్నారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తావా.. జగన్ ప్రజలకి మంచి చేస్తున్నందుకు తొక్కెస్తావా అంటూ ప్రశ్నించారు. కారణం లేకుండా జగన్ మీద ద్వేషం పెంచుకున్నావు. జగన్ మీద ద్వేషంతో దుర్మార్గుడైన చంద్రబాబుతో కలిసావు. వ్యవస్థలను గుప్పుట్లి పెట్టుకునే అరాచక శక్తిగా మారిన చంద్రబాబుకి నువ్వు సపోర్ట్ చేస్తావా అన్నారు. జగన్ ను సైకో అంటున్నావు, నీకంటే సైకో ఎవరున్నారు. పిచ్చి కేకలు వేస్తూ సభల్లో మాట్లాడతావు. చంద్రబాబు అధికారం కోసం ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు పెట్టీ, తండ్రి పిల్లలను వేరు చేశాడు. ఈ రోజు జగన్ కుటుంబంలో గొడవలు పెడుతున్నాడు.. చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు… పవన్ పార్టీ చంద్రబాబు కోసం పెట్టాడు, చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి.