తన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఏపీసీసీ వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహచరులపై కూడా అసభ్య కామెంట్లు పెడుతున్నారని వారి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. పల్లకిని మోయడానికి తప్ప పావలా వంతు కూడా పనికి రావని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన-టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడదల అయింది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ కావడం మొదలైంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో శని, ఆది వారాల్లో చెదురు మదురుగా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీకి ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు.
టీడీపీ జనసేన పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రపదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ అధ్వర్యంలో ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
రోజాకు ఆరాటం ఎక్కవ పోరాటం తక్కువ అని తాను చేస్తున్న పనులకు ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. జగన్ అన్నపై అనవసరంగా నిందలు వేస్తుందంటూ విమర్శంచారు.
ఆంధ్రపదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై ఎంపీ రఘురామ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఏపీసీసీ వైఎస్ షర్మిల అరెస్టు అయ్యారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలను కూడా అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సీఎం జగన్‌పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కులాలు కొట్టుకు చావాలనేది జగన్ నైజాం అన్నారు. రాష్ట్రాభివృద్ధికోసమే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. సొంత చెల్లెలుకే న్యాయం చెయ్యలేని జగన్ ఆంధ్రప్రజలను ఏం న్యాయం చేస్తాడని విమర్శించారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వైసీపీ పార్టీపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అసలు భద్రత లేదన్నారు.
పీచు మిఠాయి అంటే అందరికీ ఇష్టమే కానీ అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు దాన్ని నిషేధించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించనున్నట్లు తెలుస్తుంది.
వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు.
ఆ కుర్చీని మడత పెట్టి.. ఈ డైలాగ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆ డైలాగ్ వినపడుతోంది. అయితే ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ నోట వినబడితే ఎలా ఉంటుందో అని చాలామంది అనుకుంటున్నారు.