»It Was Decided That Even A Part Of Pavala Vantu Was Useless That Post Went Viral
Amabti Rambabu: పావలా వంతు కూడా పనికిరావని తేల్చేశారు.. అంబటి పోస్ట్ వైరల్
టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. పల్లకిని మోయడానికి తప్ప పావలా వంతు కూడా పనికి రావని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
Amabti Rambabu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 118 స్థానాలను ప్రకటిస్తూ.. అందులో 94 సీట్లలో టీడీపీ పోటీచేస్తుంది. దానికి సంబంధించిన 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించింది. అందులో ఈ రోజు 5 స్థానాల అభ్యర్థులను జనసేనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాజగా ప్రకటించిన ఈ సీట్లపై వైసీపీ నేతలు వవిమర్శలు గుప్పిస్తున్నారు. జనసేనకు కేవలం 24 సీట్లేనా అంటే ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు… ఛీ అంటూ పవన్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై స్పందించారు. జనసేనకు అభ్యర్థులే దొరకడంలేదని, చంద్రబాబు మరోసారి వంగవీటి రాధాను మోసం చేశారని అన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కూడా స్పందిస్తూ.. చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.