ఏపీసీసీ వైఎస్ షర్మిల అరెస్టు అయ్యారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలను కూడా అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
YS Sharmila: ఏపీలో రాజకీయం హీటెక్కింది. మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్(Congress) చలో సెక్రటేరియట్(Chalo Secretariat)కు పిలుపునించింది. ఈ కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీ తీశారు. కార్యకర్తలతో పాటు ఏపీసీసీ(APCC ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila ) కూడా ఇదే ర్యాలీలో సచివాలం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుమీద బైఠాయించారు. కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, పార్టీ నేతలకు వాగ్వాదం జరిగింది.
అనంతరం అమరావతి కరకట్టపై పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేయడానకిి ప్రయత్నించారు. దీంతో షర్మిల రోడ్డుమీదనే బైఠాయించారు. గుమిగూడిన పోలీసులు షర్మిలను బలవంతంగా అరెస్టు చేసి వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వీరిన దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.