»Pawan Kalyan Criticized Ap Cm Jagan In Bhimavaram Janasena Meeting
Pawan Kalyan: మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం
సీఎం జగన్పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కులాలు కొట్టుకు చావాలనేది జగన్ నైజాం అన్నారు. రాష్ట్రాభివృద్ధికోసమే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. సొంత చెల్లెలుకే న్యాయం చెయ్యలేని జగన్ ఆంధ్రప్రజలను ఏం న్యాయం చేస్తాడని విమర్శించారు.
Pawan Kalyan criticized AP CM Jagan in Bhimavaram Janasena meeting.
Pawan Kalyan: ప్రజలు కొట్టుకు చావాలనేది జగన్ నైజాం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. కుటుంబాలను విశ్చిన్నం చేయడం, మనుషులను విడగొట్టే విష సంస్కృతి జగన్(YS Jagan) నుంచి ప్రజలు నేర్చుకున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన(JanaSenaParty) కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. జనాన్ని కలిపే వారినే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని, ఆంధ్రకోసం ప్రాణత్యాగం చేసిన పొట్టిశ్రీరాములు ఎప్పటికీ ప్రజలకు గుర్తుంటాడని పేర్కొన్నారు. అంతే కానీ హత్యారాజకీయాలు చేసే వైసీపీ నాయకులు కాదని అన్నారు. మీరు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాము అని, అయినా తమతో యుద్దం చేసే నైతికత జగన్కు లేదని ఎద్దేవ చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడి వేల కోట్లు సంపాదించి బిడ్డలకు ఇస్తే, సొంత చెల్లెకు అన్యాయం చేసి, ఆస్తి లాక్కున్నాడు, అంతే కాదు సాక్షీలో, భారతి సిమెంట్లో వాటా కూడా ఇవ్వలేదని, ఇది చాలా దారుణం అని పవన్ కల్యాణ్ అన్నారు. చెల్లెలుకే న్యాయం చెయలేని జగన్ ఆంధ్ర ప్రజలకు ఏం చేస్తాడని అన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే తాను పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆ దొంగల నుంచి కాపాడాలనే జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నట్లు వ్యాఖ్యానించారు. జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జగన్ ఉన్నా లేకున్నా పేదలకు సంక్షేమం అందుతుంది అని వెల్లడించారు. గత ఎన్నికల్లో ఓడిపోనా జనసేన ఇప్పుడు బలంగా నిలబడిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.