రోజాకు ఆరాటం ఎక్కవ పోరాటం తక్కువ అని తాను చేస్తున్న పనులకు ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. జగన్ అన్నపై అనవసరంగా నిందలు వేస్తుందంటూ విమర్శంచారు.
Roja: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)పై మంత్రి రోజా(Roja) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్నపై వీరు చేస్తున్నవి అన్నీ అసత్య ప్రచారాలే అని అన్నారు. డీఎస్సీ విషయాన్ని కావాలనే వీరంత రాజకీయం చేస్తున్నారని అన్నారు. కేవలం ఆరోపణలు తప్ప ఒక్క విషయంలో నిజం లేదని వ్యాఖ్యానించారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు 17 వేల పోస్టులను భర్తీ చేశారని అన్నారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తే.. అనవసరంగా వీరంతా నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. తిరుమలలో దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత మూడు నెలల వరకు తాను తెలంగాణ బిడ్డనని అక్కడ రాజకీయం చేసింది. అక్కడ చేసింది ఏం లేదు కేవలం హడావిడి తప్ప. అలాగే ఏపీకి వచ్చి చేసేదే కూడా అదే అని రోజ ఎద్దేవా చేశారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో ఆమె చేసిన హడావుడి చూస్తే, తనకు రాజకీయాలపూ కొంచమైన అవగాహన లేదని అర్థమవుతుందని అన్నారు. ఆమె చేస్తున్న పనులకు ప్రజలు నవ్వుకుంటున్నారని, పోరాటం తక్కువ ఆరాటం ఎక్కవ అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని, చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని, పవన్ కల్యాణ్ మాట్లాడే ముందు నిజం తెలుసుకోవాలని అన్నారు. జగన్ షర్మిలకు ఆస్తి సక్రమంగానే ఇచ్చారని, ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోమని అన్నారు.