ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జులైలో జరగనుంది. దీనికి ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరుగుతాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
Anant Ambani, Radhika Merchant Marriage : భారత సంపనున్నల్లో అగ్రగణ్యుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో వచ్చే జూలై 12న జరగబోతోంది. దీనికి ముందే మార్చి 1 నుంచి 3వ తారీఖు వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు వందలాది మంది అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్లో గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో జరగనున్నాయి.
ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెటా సీఈఓ జుకర్‌బర్గ్, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ … లాంటి అంతర్జాతీయ ప్రముఖులు అంతా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చే అతిథులందరినీ రిసీవ్ చేసుకునేందుకు ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల దగ్గర చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేశారు. మార్చి 1 ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ విమానాలు వారిని జామ్‌నగర్ చేరుస్తాయి.
అతిథులు హ్యాండ్ బ్యాగులతో పాటు లగేజీ బ్యాగులను కూడా తీసుకెళ్లొచ్చు. జతగా వస్తే మూడు సూట్‌కేసుల వరకు వీలుంటుంది. అంతకు మించి లగేజీ తీసుకువస్తే ఇతర విమానాల ద్వారా జామ్ నగర్‌కు తీసుకువస్తారు. అక్కడ మార్చి 1, 2, 3 తేదీల్లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అతిథులు ప్రతి రాత్రికి వేర్వేరు థీమ్‌లతో దుస్తులు ధరించేలా ఏర్పాట్లు చేశారు.మొదటి రోజు ఎవర్ ల్యాండ్‌లో ఎలిగెంట్ కాక్ టెయిల్ థీమ్‌లతో వేడుకలు జరుగుతాయి.