ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆమెకు షాక్ ఇచ్చారు. ఆర్కే మళ్లీ వైసీపీలోకి చేరనున్నట్లు సమాచారం.
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై స్పందించారు టాలివుడ్ కమిడియన్ అలీ. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధమేనన్నారు.
విశాఖనగరం ఉత్తర నియోజికవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎండగట్టారు. రూ. 5 ఇస్తే ఏదైనా చేసే పేటీఎమ్ బ్యాచ్ ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు శత్రువులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు ఉదయం సింహాచలం వెళ్లి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. తర్వాత నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడారు.
ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ మహారత్న అవార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అందుకున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి అద్భుతాన్ని తన ఖాతాలో వేసుకుంది. GSLV- F14 రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ లోని బీఎఫ్ 3లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
టీడీపీ నుంచి వైసీపీకు వెళ్లిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ పశ్చిమంలో తెలుగుదేశం టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సభలో మాట్లాడుతూ.. టీడీపీ, జనసైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే ఊరుకునేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్య దేవాలయంలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
సీఎం జగన్, ప్రభుత్వం ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్ సినిమా తీశారని.. గతేడాది డిసెంబర్18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శుక్రవారం రథ సప్తమి పర్వ దినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేకంగా సూర్య వాహనాన్ని అధిరోహించు భక్తులను కటాక్షించారు. భక్తులు పరవశంతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించి పునీతులయ్యారు.
రాజస్థాన్‌కి చెందిన ప్రహ్మద్ గుర్జర్ అనే వ్యక్తి స్వయంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అక్కడున్న మగ సింహం దాడి చేయడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే....
ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉన్నాయి. ఈ రాజధాని విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారయణ తెలిపారు.