Vijayasai Reddy : ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ మహారత్న అవార్డును వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సంసద్ మహా రత్న (పార్లమెంటరీ మహారత్న) అవార్డును ఈరోజు ఢిల్లీలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో, రాజ్యసభ సభ్యుల హోదాలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అందుకున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా ఈ అవార్డుల కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డులను అందజేశారు. 17వ లోక్ సభ కాలంలో టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అత్యుత్తమ పనితీరుకు గాను ఈ అవార్డు విజయసాయిరెడ్డి దక్కింది.
Grateful and honored to receive the prestigious Sansad Maha Ratna award at the 14th Edition of Sansad Ratna Awards 2024. Recognized for my contributions through the Parliamentary Standing Committee on Transport, Tourism, and Culture. This award is a testament to the dedication… pic.twitter.com/hqWjfFk4hD