»Ap Is Moving Towards Banning Peach Candy This Is The Reason
Cotton candy: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ.. కారణం ఇదే
పీచు మిఠాయి అంటే అందరికీ ఇష్టమే కానీ అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు దాన్ని నిషేధించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించనున్నట్లు తెలుస్తుంది.
AP is moving towards banning peach candy.. This is the reason
Cotton candy: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పీచుమిఠాయి( Cotton candy) అంటే ఇష్టంగా తింటారు. అందులో ఉండేది కొంచమే అయినా దాన్ని చూడగానే నోరు ఊరుతుంది. ఎంతో కాలంగా వాటిని అందరూ తింటున్నారు. తాజాగా అందులో ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు నిషేధం విధించారు. తాజగా దీన్ని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి అన్ని ల్యాబ్స్‌కు పంపించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఆరోగ్య, రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ జె. నివాస్ మాట్లాడుతూ.. పీచుమిఠాయిలో సింథటిక్ రంగులను వాడుతున్నట్లు తెలిపారు.
అనుమతి లేని రంగులు, ఆరోగ్యానికి హానికరమైన రంగులను వాడడం వలన అవి క్యాన్సర్(Carcinogens)కు కారణం అవుతున్నాయని వెల్లడించారు. రోడమైన్ బీ, మెటానిల్ ఎల్లో వంటి రంగులు ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. వెంటనే పీచుమిఠాయి నమూనాల సేకరణ, పరీక్షల ప్రక్రియ చేపట్టినా, ఫలితం రావడానికిి నెల రోజుల సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ఇక రంగులేని పీచుమిఠాయిలు ఆరోగ్యానికి హానికరమని అన్నారు. వాటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారని అన్నారు. ప్రస్తుతం పండుగలు, జాతరల్లో వీటిని తగ్గించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.