»Akhil Likes Ram Charans Wife Upasana At All Is That The Reason
Upasana: ఉపాసనకు ఆ హీరో అస్సలు నచ్చడా? కారణం అదేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ కోడలిగా మంచి పేరు తెచ్చుకుంది ఉపాసన. అయితే.. టాలీవుడ్లో ఓ యంగ్ హీరో అంటే ఉపాసనకు అస్సలు నచ్చడట. ఇదే ఇప్పుడు వైరల్‌గా మారింది.
Akhil likes Ram Charan's wife Upasana at all? Is that the reason?
Upasana: గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2023 జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాభిమానులు తెగ మురిసిపోయారు. ఆ పాపకు క్లింకారా అని నామకరణం చేశారు. ఇక రీసెంట్గా.. ఉపాసన చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మొదటి బిడ్డకి చాలా సమయం తీసుకున్నాను కానీ.. రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయలని అనుకోవడం లేదు. రెండో బిడ్డకి జన్మనివ్వడానికి నేను రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో.. ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఉపాసనకు ఓ టాలీవుడ్ హీరో అంటే అస్సలు నచ్చదట. అది కూడా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడం విశేషం. సరైన మాస్ సినిమా పడాలే గానీ.. అక్కినేని అఖిల్ స్టార్ హీరోగా దుమ్ముదులిపేయడం గ్యారెంటీ.
నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. అలాంటి హీరో ఉపాసనకు నచ్చడు.. అనేది కాస్త ఆశ్చర్యమే. ఉపాసనకు అఖిల్ అంటే పడదని, అసలు అతనితో మాట్లాడటానికి ఇష్టపడదని ఓ న్యూ వైరల్ అవుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు అని అంటున్నారు. గతంలో అఖిల్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన శ్రేయా భూపాల్‌తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఈ విషయంలోనే అఖిల్ అంటే ఉపాసనకు పడదట. ఎందుకంటే.. శ్రేయా భూపాల్, ఉపాసన మంచి ఫ్రెండ్స్. అందుకే.. ఉపాసనకు అఖిల్ నచ్చడని స్టోరీలు రాసేస్తున్నారు. కానీ.. రామ్ చరణ్, అఖిల్ మధ్య మాత్రం సూపర్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటప్పుడు.. అఖిల్‌కు ఉపాసన నచ్చడనే విషయంలో నిజం ఉందని చెప్పలేం.