W.G: సహజ సిద్ధంగా పండిన కూరగాయలతో ఆరోగ్యం మెండుగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో ఊర్మిళ అన్నారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం సిబ్బంది స్టాల్లో కూరగాయలను విక్రయించారు. ఆయా కూరగాయలను పలు శాఖల అధికారులు, ప్రజలు కొనుగోలు చేశారు. సీడీపీవో మాట్లాడుతూ.. సహజ సిద్ధంగా పండించిన పంటను వినియోగించాలన్నారు.
NTR: ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో క్రీడాకారులు కూడా భాగస్వామ్యం కావాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిసెంబర్ 29 నుంచి 30 వరకు జరిగే ఉమ్మడి కృష్ణా జిల్లాల ఇంటర్, పాలిటెక్నిక్ ...
విజయనగరం: కొత్త సంవత్సరం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని గుర్ల ఎస్సై నారాయణరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. డిసెంబర్ 31న, డీజేలు, శబ్ద కాలుష్యం చేయకూడదని సూచించారు. రోడ్లపై గుంపులుగా సంచరిస్తే చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలని హితవు పలికారు.
కృష్ణా: ఆల్ ఏపీ బీసీ–వోబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి ఉద్యోగుల మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ నేతలు తెలిపారు. ఈ మహాసభకు కృష్ణాజిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆహ్వానం మేరకు గుడివాడ నియోజకవర్గ బీసీ ఐక్యవేదిక తరపున పూర్తి మద్దతు తెలియజేస్తూ..బీసీ ఉద్యోగ సంఘం నాయకులు బ్రౌచర్‌ను ఈరోజు ఆవిష్కరించారు.
అనకాపల్లి: ఎస్ రాయవరం మండల పరిధిలో 15 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి సౌజన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీన మరో 24 టన్నులు ఎరువులు అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా చేస్తామన్నారు .రబీ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు వారికి అవసరమైన ఎరువులను విక్రయించనున్నట్లు తెలిపారు.
KDP: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని అర్బన్ సీఐ నరేశ్ బాబు తెలిపారు. 31 రాత్రి 12:30 గంటల్లోపు వేడుకలు ముగించాలని, డీజేలు, టపాసులు నిషేధమన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్, రోడ్లు బ్లాక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
W.G: నెలరోజులపాటు జరిగే భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అమ్మవారి 62వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 17న మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. సోమవారం ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు.
CTR: ఎఫ్ఏ-3 పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేయాలని ఎంఈవో సిద్ధరామయ్య తెలిపారు. పులిచెర్ల మండలం మంగలంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఎంఈవో తనిఖీ చేశారు. టెన్త్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. క్రమ శిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించేలా కృషి చేయాలని తెలిపారు. హెచ్ఎం ఫజురుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ELR: గిరిజనులు, పోలవరం నిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటించామని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికీ.. నిర్వాసిత ప్రాంతాలు ఉన్న ఏరియా కాబట్టి రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశామన్నారు.
W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై పెంచిన పనిగంటలు వెనక్కి తీసుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వెలమపేట రామాలయం వద్ద నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 31 నుంచి విశాఖలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయాలంటూ నినాదాలు చేశారు. కార్మికులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి: బంద్‌లో పాల్గొన్న సీపీఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఖండించారు. అరెస్ట్ అయిన పార్టీ నేతలను ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏం నేరం చేసాడని పార్టీ నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించారని ప్రశ్నించారు.
నెల్లూరు నగరంలో VR డిగ్రీ కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఎ నాయకులు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర మాట్లాడుతూ.. ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకున్న ఈ కళాశాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
TPT: నూతన సంవత్సర వేడుకల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గూడూరు DSP గీతా కుమారి హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి ఎవరైనా బైక్ రేసింగ్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్లపై కేకులు కట్ చేయరాదన్నారు. డీజేలు భారీ శబ్దాలతో స్పీకర్లు, డాన్స్ కార్యక్రమాలు నిషేధమని స్పష్టం చేశారు.
NLR: కందుకూరు పట్టణం 3వ వార్డు నల్లమల్లివారితోటలోని సచివాలయాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది ఏయే విధులకు వెళ్లారో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు.
KRNL: ఎమ్మిగనూరులో సీపీఐ 100 ఏళ్లు పూర్తి చేసి 101వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సోమవారం సంబరాలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు బజారి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడే పార్టీ సీపీఐ అని, పేదల హక్కుల సాధనలో ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.