W.G: నెలరోజులపాటు జరిగే భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అమ్మవారి 62వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 17న మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. సోమవారం ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారి మూల విరాట్ పునః దర్శనం భక్తులకు కల్పించారు.
CTR: ఎఫ్ఏ-3 పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేయాలని ఎంఈవో సిద్ధరామయ్య తెలిపారు. పులిచెర్ల మండలం మంగలంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఎంఈవో తనిఖీ చేశారు. టెన్త్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. క్రమ శిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించేలా కృషి చేయాలని తెలిపారు. హెచ్ఎం ఫజురుల్లా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ELR: గిరిజనులు, పోలవరం నిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ప్రకటించామని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికీ.. నిర్వాసిత ప్రాంతాలు ఉన్న ఏరియా కాబట్టి రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశామన్నారు.
W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై పెంచిన పనిగంటలు వెనక్కి తీసుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వెలమపేట రామాలయం వద్ద నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 31 నుంచి విశాఖలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయాలంటూ నినాదాలు చేశారు. కార్మికులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి: బంద్‌లో పాల్గొన్న సీపీఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఖండించారు. అరెస్ట్ అయిన పార్టీ నేతలను ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏం నేరం చేసాడని పార్టీ నాయకుడు అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించారని ప్రశ్నించారు.
నెల్లూరు నగరంలో VR డిగ్రీ కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఎ నాయకులు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర మాట్లాడుతూ.. ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకున్న ఈ కళాశాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
TPT: నూతన సంవత్సర వేడుకల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గూడూరు DSP గీతా కుమారి హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి ఎవరైనా బైక్ రేసింగ్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్లపై కేకులు కట్ చేయరాదన్నారు. డీజేలు భారీ శబ్దాలతో స్పీకర్లు, డాన్స్ కార్యక్రమాలు నిషేధమని స్పష్టం చేశారు.
NLR: కందుకూరు పట్టణం 3వ వార్డు నల్లమల్లివారితోటలోని సచివాలయాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది ఏయే విధులకు వెళ్లారో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సేవలు, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు.
KRNL: ఎమ్మిగనూరులో సీపీఐ 100 ఏళ్లు పూర్తి చేసి 101వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సోమవారం సంబరాలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు బజారి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడే పార్టీ సీపీఐ అని, పేదల హక్కుల సాధనలో ఎప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
GNTR: ఫిరంగిపురంలోని ఎరువులు, పురుగుమందుల అమ్మకాల దుకాణాలను గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. మోహన్ రావు, మండల వ్యవసాయాధికారి వాసంతి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియాను విక్రయించాలని స్పష్టం చేశారు.
ELR: ములగలంపల్లి పంచాయతీ పాకలగూడెంలో గ్రామంలో మంచినీటి ట్యాంక్ గుండా రెండు నెలలుగా రంగు మారిన నీరు వస్తుండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే నీటిని తాగడంతో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్, పైపులను సిబ్బంది శుభ్రం చేయడం లేదన్నారు. అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీరు అందించాలని కోరుతున్నారు.
KRNL: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాసిం వలి తీవ్రంగా సోమవారం ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి దాడులు ఆగేలా ఒత్తిడి తీసుకురావాలని, మైనారిటీల భద్రతకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని అయన కోరారు.
తిరుపతి: మహతి ఆడిటోరియంలో Seven Hills High School – Artbeats 2025–26 సాంస్కృతికోత్సవానికి తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో పాటు కళలు, సంస్కృతి వ్యక్తిత్వ వికాసానికి అవసరమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మండల స్థాయిలోని రెవెన్యూ కార్యాలయంలో కూడా అర్జీలు అందించవచ్చని వివరించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారించడం కోసమే ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం కర్ణాటక మైన్స్ మినిస్టర్ మల్లికార్జున్, దావనగేర్ ఎంపీ ప్రభా మల్లికార్జున్‌తో కలిసి తిరుమలలోని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కనిగిరి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామిని వేడుకున్నట్లు ఉగ్ర తెలిపారు.