PLD: యడ్లపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మైదవోలు గ్రామంలో నీటివనరుల సంరక్షణ పనులను ఆరంభించారు. చెరువులో చెత్త తొలగింపు పనులను పర్యవేక్షించారు. అనంతరం బ్రిక్స్ పరిశ్రమలో 25 కిలోవాట్ల సోలార్ యూనిట్‌ను ప్రారంభించారు. తర్వాత వంకాయలపాడులో రూ.10 లక్షలతో సిమెంట్ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ డా. జీ.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండి వినతులు స్వీకరిస్తారు. రెవెన్యూ క్లినిక్‌లలో కూడా అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. అలాగే, Meekosam పోర్టల్, 1100 ద్వారా అర్జీల వివరాలు తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు.
సత్యసాయి: గ్రామాల్లో నీటి నిల్వలను పెంచడం అత్యంత అవసరమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం గోరంట్ల మండలం రెడ్డి చెరువు కట్ట వద్ద జలధార–జలహారతి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. జలాధారలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని, చెరువులు, కుంటలు, కాలువలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
CTR: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి–ముద్దికుప్పం మధ్య రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన చంద్రన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స పొందుతూన్నాడు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని జబర్దస్త్, సినీ నటి సత్యశ్రీ ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు వారికి అందజేశారు.
KRNL: ఆలూరులో వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వెంగళాయిదొడ్డి చెరువుకు హంద్రి నీవా ఎత్తిపోతల ద్వారా నిధులు మంజూరు చేయాలని ప్రజలు వినతి చేశారు. ప్రజా సమస్యలను విన్న జ్యోతి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మై టిడిపి యాప్‌లో ప్రథమ స్థానం సాధించిన పుట్ట వీరేష్‌కు గోల్డెన్ బైసికిల్, ప్రశంసపత్రం అందజేశారు.
ELR: దెందులూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం వినతులు అందజేశారు. సమస్య ఏదైనా సరే, పరిష్కారం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
E.G: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా నిర్వహిస్తున్న PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
PLD: నరసరావుపేటలో గుంటూరు రోడ్డులోని జామియా మసీదు వద్ద ఉచిత చలివేంద్రాన్ని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మంచినీళ్లు, మజ్జిగ, లస్సీ పంపిణీ చేస్తున్నారు. వేసవి దృష్ట్యా ఇది ప్రజలకు ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: పామూరు మండలం వీరబద్రాపురం గ్రామంలో ఎస్సై అనుక్ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై ఇవాళ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, రూ.5,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే వెంటనే సమాచారం అందజేయాలని ప్రజల్ని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
GNTR: తెనాలిలో అగ్నిమాపక వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరవ రోజు ఆదివారం హాస్పిటల్స్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్, సిబ్బందితో కలిసి హాస్పిటల్స్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రోగులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
WG: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కాంగ్రెస్ మిత్రపక్షాలు వ్యతిరేకించి, తమ పతనానికి తామే నాంది పలికారని మంత్రి నిమ్మల రామా నాయుడు విమర్శించారు. పాలకొల్లులోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాలో, ఓట్లలో సగం ఉన్న మహిళలు రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
ATP: CM చంద్రబాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ.. MLA కాలవ శ్రీనివాసులు నిర్వహిస్తున్న దశమహా విద్య హోమాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి మాతాంగి దేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దేవర్ల మురళి పాల్గొన్నారు.
CTR: తిరుపతి జిల్లా కళ్యాణి డ్యామ్‌లో ఈతకు వెళ్లి పుంగనూరుకు చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. పుంగనూరు మండలం చిన్న మిట్టపల్లికి చెందిన మురళీమోహన్ మద్యం మానేసేందుకు మూలస్థాన అమ్మవారి ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్లాడు. చివరిసారిగా స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అతను, అనంతరం డ్యామ్‌లో ఈతకు దిగి నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.