భారత రాష్ట్ర సమితి(BRS) - జనసేన (Janasena)కు మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి కదా అని ప్రతినిధి ప్రశ్నించగా... 'వెయ్యి కోట్లు ఏమిటి.. బీఆర్ఎస్ ఏమిటి.. పవన్ కళ్యాణ్ ఏమిటి. పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కాదు.. లక్ష కోట్లు పెట్టి కొనాలనుకున్నా కూడా.. (కుదరదు). ఆయన ఆలోచనా విధానాలు ఏనాడు కూడా మారవు.' అని సమాధానం ఇచ్చారు నాదెండ్ల.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena chief Pawan Kalyan) ను రూ.1 లక్ష కోట్లు పెట్టినా కొనలేరని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత రాష్ట్ర సమితి(BRS) – జనసేన (Janasena)కు మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి కదా అని ప్రతినిధి ప్రశ్నించగా… ‘వెయ్యి కోట్లు ఏమిటి.. బీఆర్ఎస్ (BRS) ఏమిటి.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏమిటి. పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కాదు.. లక్ష కోట్లు పెట్టి కొనాలనుకున్నా కూడా.. (కుదరదు). ఆయన ఆలోచనా విధానాలు ఏనాడు కూడా మారవు.’ అని సమాధానం ఇచ్చారు నాదెండ్ల. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) అడుగు పెట్టడానికి ముందు, ఏపీకి ఆ పార్టీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో రెచ్చగొట్టి, ద్వేషాలు పెంచింది కేసీఆర్ (K Chandrasekhar Rao)అన్నారు. బీజేపీ (BJP), జనసేన (Janasena) మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ (Janasena 10th foundation) ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన మీటింగ్ జరగబోతుందని చెప్పారు.
జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం భిన్నంగా ఉంటుందని, రూ.500 చెల్లించి ఈ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గత కొంతకాలంగా మంచి ఆదరణ లభిస్తుందన్నారు. మెంబర్ షిప్ లో తాము కొత్త పంథాను అనుసరించడం వల్ల సిన్సియర్ గా పని చేసే కార్యకర్తలు దొరుకుతున్నారన్నారు. జనసేన పుట్టి పదేళ్లు అవుతోందని, ఈ నేపథ్యంలో తమకు మంచి పరిస్థితులు ఉంటాయని ధీమాగా ఉన్నట్లు చెప్పారు. తాము నెమ్మదిగా ఎదిగినప్పటికీ, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామన్నారు. పవన్ ఎప్పుడు మాట్లాడినా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి మాట్లాడుతారని, జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా అలాగే మాట్లాడుతారన్నారు.
ఇదిలా ఉండగా, మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరగనున్న జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను నాదెండ్ల బుధవారం పరిశీలించారు. రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు పై పాలకులు ఏం చేయాలో దిశ నిర్దేశం చేసేలా ఇ సభ ఏర్పాటు చేశామని నాదెండ్ల పేర్కొన్నారు. గత సంవత్సరం తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా జనసేన ముందు వరుసలో నిలబడి పోరాడిందన్నారు. రాష్ట్ర చరిత్రలో కని వినీ ఎరగని విధంగా బహిరంగ సభకు అయిదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 34 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, మరో 60 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి కూడా రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ భూములను అందించారన్నారు. తమకు రైతాంగం ఎంతో అండగా నిలబడినందుకు, వారికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. సభకు వచ్చిన వీర మహిళలు, జన సైనికులు, ప్రజలు తిరిగి గమ్యస్థానం సురక్షితంగా వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ 14వ తేదీ రెండు గంటలకు మంగళగిరి వారాహి వాహనం పైన బయలుదేరి సభా ప్రాంగణానికి సాయంత్రం అయిదు గంటలకు చేరుకుంటారని వెల్లడించారు.