Minister Venugolala Krishna: చిరంజీవి రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. చిరంజీవి చేసిన నష్టం ఇంకా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. ఎవరైనా ప్రజల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు పెడతారని.. కానీ చిరంజీవి మాత్రం తన కాపు సామాజిక్ వర్గం కోసం ప్రజారాజ్యం పెట్టారని ఆరోపించారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపడం వల్ల రాష్ట్రం రెండు ముక్కలయ్యిందన్నారు. దీంతో ఏపీకి నష్టం జరిగిందని, ఇప్పటికీ సమాన వాటాలు దక్కలేదన్నారు.
చిరంజీవి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని భావించామం. కానీ ఇది కూడా విరుద్ధంగా కొనసాగుతుందన్నారు. చంద్రబాబు వద్ద ఇన్ని సీట్లు ఇవ్వాలని ధైర్యంగా అడిగే హక్కు లేని అసహాయ రాజకీయ నాయకుడు పవన్‌కల్యాణ్ అంటూ మండిపడ్డారు. పవన్ వల్ల జనసేన నాయకులు బాధపడుతున్నారని, పొత్తుల కారణంగా ఎక్కడా తమ రాజకీయ భవిష్యత్ నాశనం అవుతుందో నని ఆందోళనలో ఉన్నారని వెల్లడించారు.