రాష్ట్ర ప్రభుత్వం (andhra pradesh government) భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను (ias reshuffle) బదలీ చేసింది. మొత్తం 54 మందికి స్థానచలనం కలిగింది. కొందరు సీనియర్ అధికారులతో పాటు ఎనిమిది జిల్లాల కలెక్టర్లు (collectors), పలువురు జాయింట్ కలెక్టర్లు (joint collectors) ఉన్నారు. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న సమయంలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదలీ (ias transfer) ప్రాధాన్యతను సంతరించుకున్నది. గవర్నర్ కు ప్రత్యేక కార్యదర్శిగా పని చేసి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా నియమించింది. కొద్ది రోజుల క్రితం ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ తదితరులు గవర్నర్ హరిచందన్ ను కలిసి వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిసోడియాను ప్రభుత్వం బదలీ చేసింది. ఇప్పటి వరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సూర్యనారాయణ తదితరులకు సిసోడియా గవర్నర్ అపాయింటుమెంట్ ఇప్పించారని భావిస్తోంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తప్పించింది. ఆయనను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ గా నియమించింది. మొత్తం 57 మందికి స్థాన చలనం కలిగింది.
ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లు (new collectors to districts) వచ్చారు. రంజిత్ బాషాను బాపట్ల, రాజబాబును కృష్ణా, సగిలి షణ్ మోహన్ ను చిత్తూరు, సృజనను కర్నూలు, హరినారాయణ్ ను నెల్లూరు, నాగలక్ష్మిని విజయనగరం, అరుణ్ బాబును శ్రీ సత్యసాయి జిల్లా, గౌతమిని అనంతపురం జిల్లాలకు కలెక్టర్లుగా స్థానచలనం చేశారు.
ఇక కలెక్టర్లుగా ఉన్న సూర్యకుమారిని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, కోటేశ్వర రావును కమిషనర్ అండ్ డైరెక్టర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, చక్రధర్ బాబు ఏపీ జెన్కో ఎండీ, విజయ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కు మార్చారు. తొమ్మిది జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించారు.