»Kanna Laxminarayana Join To Tdp Behind This Reason
kanna laxmi narayana:టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.. మంత్రి పదవీ?
kanna laxmi narayana:కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 23వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అంతకుముందు అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సుధీర్ఘంగా చర్చలు జరిపారు.
kanna laxmi narayana:కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 23వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అంతకుముందు అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సుధీర్ఘంగా చర్చలు జరిపారు. భవిష్యత్ ప్రణాళిక, ఏ పార్టీలో చేరితే బాగుంటుందనే విషయంపై చర్చించారు. వారి అభీష్టం మేరకు టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి జనసేన వైపు మొగ్గ చూపినా.. ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో టీడీపీ వైపు కన్నా చూశారు. అధికార వైసీపీలో ప్రాధాన్యం లభిస్తుందో లేదోననే సందేహాం కన్నాకు ఉంది. అందుకే మధ్యేమార్గంగా టీడీపీని ఎంచుకున్నారు.
బాబు నాయకత్వంలో..
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి అవుతుందని కన్నా (kanna laxmi narayana) అనుచరులు భావించారు. రాజధాని అమరావతి నిర్మాణం కూడా అవుతుందని అంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థుడు కావాలని, అందుకు చంద్రబాబే సరైన వ్యక్తి అని వారంతా అభిప్రాయపడ్డారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు సమక్షంలో..
ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం గుంటూరు కన్నావారి తోటలో గల నివాసం నుంచి మద్దతుదారులతో కలిసి ర్యాలీగా బయల్దేరతారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నివాసానికి వెళతారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారు. ఆయనతోపాటు బీజేపీకి రాజీనామా చేసిన వారు కూడా జాయిన్ అవుతారు. టీడీపీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. కన్నా లక్ష్మీనారాయణకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
చదవండి:Kanna : టీడీపీలో చేరేందుకు కన్నా కి ముహూర్తం ఫిక్స్..!
మంత్రి పదవీ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కాపు కోటాలో సీనియర్ రాజకీయ నేతకు మంత్రి (minister post) పదవి దక్కుతుంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారని మరికొందరు అంటారు. టీడీపీ(tdp), జనసేన (janasena) పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే సునాయాసంగా అధికారం దక్కించుకోవచ్చని ఆయన భావించారు. బీజేపీలో జీవీఎల్ (gvl) ప్రవర్తన బాగోలేదని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. వంగవీటి రంగా పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని గతంలో తాము ఉద్యమం చేశామని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో జీవీఎల్ పాల్గొంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కొందరు రాత్రికి రాత్రే స్టార్లు అయిపోదామం అనుకుంటున్నారని జీవీఎల్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఆ వెంటనే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.
చదవండి:Chandrababu Naidu పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎలా?