ఏపీ(AP)లో ఎన్నికల(Elections) వేడి మొదలైంది. ఎలక్షన్స్‌కి ఇంకా సమయం ఉన్నా జనసేన పార్టీ(Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra)తో జనంలోకి దూసుకెళ్తున్నారు. ఈ యాత్ర ఇప్పటికే మొదటి విడత పూర్తి కాగా రెండో విడత నేటి నుంచి ప్రారంభమైంది. జనాన్ని చైతన్యపరిచేందుకు జనసేన ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించింది. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతూ పాపులర్ అవుతోంది.
జాగోరే జాగో కదిలిందిరా ‘జనసేన’ పాట:
తాజాగా విడుదల చేసిన జనసేన ప్రచార గీతం(Janasena song) వింటుంటే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఈ పాటను తెలంగాణ ఫోక్ సింగర్స్ మధుప్రియ(Madhu Priya), నల్లగొండ గద్దర్(nalgonda Gaddar)లు ఆలపించారు. జనసేన పార్టీ(janasena Party) కోసం ప్రత్యేకంగా ఈ పాటను బుర్రా సతీష్ లిరిక్స్ రాశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. జాగోరో జాగో కదిలిందిరా జనసేన అంటూ సాగే ఈ పాట పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.