వాలంటీర్లకు ఓటీపీతో పనేంటి? అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నించారు. విశాఖ జగదాంబ సెంటర్లో వారాహి యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ (CM Jagan)పై జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని ఆరోపించారు. తత మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేయడం తప్ప.. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సీఎంకు పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం జగనేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కొయ్యలగూడెంలో ఒక వాలంటీర్ మహిళ వేలిముద్రతో బ్యాంక్ నుంచి రూ.1.70 లక్షలు దోచేశాడని వివరించారు. పెందుర్తి(Pendurthi)లో ఒక వాలంటీర్ వృద్ధురాలిని హత్య చేసి నగలు దోచేశారన్నారు. వాలంటీర్లు (Volunteers) డేటా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ(YCP) ని తన్ని తరిమే వరకూ తాను నిద్దపోనని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కొండలు తవ్వేస్తారని గత ఎన్నికల్లో తాను గొంగు చించుకుని మరీ చెప్పానని పవన్ అన్నారు. అడ్డంగా దోచుకున్న వారిని గద్దెనెక్కించారని, కానీ ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే చొక్కాలు పట్టుకుని నిలదీస్తామని హెచ్చరించారు. తాను చూడటానికి పలుచగా ఉన్నా ఒళ్లంతా మందమని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ గుర్తుంచుకో.. కేంద్రంతో నిన్ను ఆడించకపోతే చూడు.. మీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను.. అప్పుడేం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. విశాఖలో రుషికొండ(Rushikonda)ను తవ్వేశారు. తుపానుల నుంచి కాపాడే కొండను చెక్కి పడేశారు. ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారు. వైసీపీ దోపిడీలు అడ్డుకోలేరా? వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి.. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి.. మీ కోసం నేను నిలబడతా” అని స్పష్టం చేశారు.