»Jagan Met With Ipac Team Report On Performance Of Mlas Is Ready
Ap Politics: ఐప్యాక్ టీమ్‌తో జగన్ భేటీ..ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక రెడీ
ప్రముఖ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ సభ్యులు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో వైసీపీ నేతల గురించి సీఎం జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు.
ఏపీ(AP)లో రసవత్తర రాజకీయాలు(Politics) సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ సలహాల సంస్థ అయిన ఐప్యాక్ బృందం(Ipac Team)తో ఏపీ సీఎం జగన్(Cm Jagan) సమావేశం అయ్యారు. వైసీపీ(YCP)కి ఐప్యాక్ సలహాలు అందిస్తూ వస్తోంది. తాజాగా శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఐప్యాక్ టీమ్ ఇంఛార్జ్ రిషి రాజ్, వైసీపీ ముఖ్య నేతలు, ఐప్యాక్ సలహా సభ్యులు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితులపై ఐప్యాక్ సభ్యులు(Ipac Team) విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం తీరుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం, పనితీరుపై సుధీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇచ్చింది. దీనిపై జగన్(Cm Jagan) మరోమారు చర్చించనున్నారు. నివేదిక ఆధారంగా గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు వంటి అంశాలతో పాటు ఆయా నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై చర్చ జరిపినట్లు సమాచారం.