chandrababu:ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్కు చేరింది. ప్రకాశం మార్కాపురం సభలో సీఎం జగన్ (cm jagan) .. చంద్రబాబుపై (chandrababu) హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.
సీఎం జగన్ (jagan) మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు నాయుడు (chandrababu) అన్నారు. జనాలను పట్టి పీడిస్తున్నాడు అని మండిపడ్డారు. మరికొన్ని నెలల్లో సైకో వెళ్లడం ఖాయం అని చెప్పారు. రాష్ట్రం నుంచి సైకో పోవాలని.. లేదంటే మనమే రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇల్లు మీది.. స్టిక్కర్ మాత్రం ఆయనదా అని అడిగారు. ఇంటి యజమాని అనుమతి లేకుండా స్టిక్కర్లు అతికించడం కరెక్ట్ కాదన్నారు.
వాలంటీర్లకు సంబంధించి కూడా చంద్రబాబు (chandrababu) కామెంట్స్ చేశారు. వాలంటీర్లు ఎందుకు సీఎం జగన్కు (jagan) వంగి వంగి మాట్లాడతారు అని అడిగారు. వారికి ఇచ్చే జీతం పైసలు జగన్ (jagan) తాతల సొమ్ము కాదని.. ప్రజాధనం అని తెలిపారు. జగన్ (jagan) నమ్మకం కాదు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని చెప్పారు. జగన్ (jagan) వెళితేనే భవిష్యత్.. ఉంటే అంధకారమే అని తెలిపారు.
బాబాయ్ గురించి పూటకో మాట మాట్లాడుతున్నారు. గుండెపోటు, రక్తపోటు.. గొడ్డలితో చంపి అంటూ విరుచుకుపడ్డారు. వారు కరుడుగట్టిన నేరస్థులు, ఆర్థిక ఉగ్రవాదులు అని మండిపడ్డారు. ధరలు అన్నీ పెరిగాయ్.. ఇచ్చేది పది గుంజేది వంద అని ఫైరయ్యారు.