Ap minister karumuri fires on telangana minister Harish rao
Ap minister karumuri Nageshwar rao:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు (Harish rao) చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ఏపీలో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణ వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసు అని నిన్న సంగారెడ్డిలో కార్మికులతో హరీశ్ రావు (harish rao) అన్నారు. అక్కడికి.. ఇక్కడికి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. ఏపీలో ఓటు (vote) రద్దు చేసుకొని.. ఇక్కడికి రావాలని కోరారు. దీనిపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri Nageshwar rao) స్పందించారు.
జీడీపీలో (GDP) దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ అని మంత్రి కారుమూరి (karumuri) తెలిపారు. ఏపీ స్కూళ్లలో (School) వసతులు ఎలా ఉన్నాయో చూడాలని కోరారు. తెలంగాణ స్కూళ్లు తమతో పోటీ పడవని చెప్పారు. ఇతర అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వివరించారు. హైదరాబాద్లో వర్షం (rain) వస్తే ఇళ్లలోకి నీరు వస్తోందని చెప్పారు. హరీశ్ రావు (harish rao) ముందు ఆ సమస్యను తీర్చాలని సూచించారు. పొరుగు రాష్ట్రంపై కామెంట్స్ చేయడం సరికాదని మండిపడ్డారు.
ఇప్పుడే కాదు నీటి కేటాయింపుల విషయంలోనే ఏపీతో తెలంగాణకు పంచాయతీ ఉండనే ఉంటుంది. వచ్చే 7,8 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది ఏపీలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందినవారిని ఇక్కడ రిజిష్టర్ చేసుకోవాలని.. ఓటు బ్యాంక్ (vote bank) మళ్లించుకోవాలని హరీశ్ రావు (harish rao) అంటున్నారు. పనిలో పనిగా ఏపీ డెవలప్ మెంట్ గురించి విమర్శలు చేయగా.. మంత్రి కారుమూరి (karumuri) కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో రోడ్లు బాగోలేవని, ఆస్పత్రులు కూడా సరిగా లేవని కూడా హరీశ్ రావు (harish rao) విమర్శించారు. అక్కడికి వెళ్లరని.. అక్కడ ఓటు ఎందుకని హరీశ్ (harish) అడిగారు. తెలంగాణ కోసం చెమట చిందించేవారు అందరూ తెలంగాణ వాసులేనని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని.. మే డే కానుకను సీఎం కేసీఆర్ (cm kcr) ఇస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలో కార్మిక భవనం కోసం రూ.2 కోట్ల మంజూరు చేస్తామని తెలిపారు.