»Harsha Kumar Lets Not Sleep Until Jagan Is Defeated
Harsha Kumar: జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం!
సీఎం జగన్‌కు దళితులంటే ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆయనను విమర్శించారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు.
Harsha Kumar: రాష్ట్రంలో జగన్ పరిపాలనపై మొదటి నుంచే విమర్శలు వెల్లువత్తుతున్నాయి. జగన్ పాలనలో మహిళలకు రక్షలేదని అత్యాచారాలు జరిగాయని కొందరు ఆరోపించారు. అయితే ఈక్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ జగన్‌పై విమర్శించారు. దళితులంటే సీఎం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు.
హర్షకుమార్ మాట్లాడుతూ.. సుమారు ఐదేళ్లుగా జైలులో పెట్టడం దుర్మార్గమని.. ఇప్పటికైనా అతడి విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. జగన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఓడించే వరకు నిద్రపోయేది లేదని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో అంబేడ్కర్ విగ్ర్రహం ఏర్పాటు సరికాదన్నారు. జగన్‌కి దళితులంటే నచ్చదు. అందుకే వాళ్లకు అన్ని అవసరాలు సమకూర్చడం లేదని హర్షకుమార్ సీఎం జగన్‌ను విమర్శించారు.