TDP : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరు..
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల్లో టీడీపీ (TDP) సత్తా చాటింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy) విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం అందుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 47మంది అభ్యర్థుల ఎలిమినేషన్ (Elimination) పూర్తి అయ్యింది.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల్లో టీడీపీ (TDP) సత్తా చాటింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy) విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం అందుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 47మంది అభ్యర్థుల ఎలిమినేషన్ (Elimination) పూర్తి అయ్యింది. తుదివరకు వైసీపీ (YCP) అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి (Pusa Ravindra Reddy) భూమిరెడ్డి మధ్య ఉత్కంఠపోరు నడిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ శ్రేణి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఇందులో మెజారిటీతో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ దూసుకుపోతోంది.
ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలోనూ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ రాయలసీమ (West Rayalaseema) గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వెనకబడ్డారు. బీజేపీకి (BJP) వచ్చిన ఓట్ల షేర్‌తో టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం పీడీఎఫ్ (PDF) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.