పల్నాటి తిరుమల(Palnati Tirumala)గా పేరుగాంచిన రాజుపాలెం మండలం దేవరంపాడు నేతి వెంకన్నస్వామి(Neti Venkanna Swamy) తిరునాళ్లకు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో నేతి వెంకన్నస్వామి తిరునాళ్లకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మార్చి 11వ తేది జరిగిన మూడో శనివారం తిరునాళ్లకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

తాజాగా నాలుగో శనివారం సందర్భంగా నేతి వెంకన్న స్వామి(Neti Venkanna Swamy)ని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా(Rk Roja)లు దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికి మంత్రులను ఆశీర్వదించారు.
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా(Rk Roja) నేతి వెంకన్నకు పూజలు నిర్వహించారు. గతవారం కూడా మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధరలు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్లను పురస్కరించుకొని భక్తులకు ఆలయ అధికారులు అన్నదానం ఏర్పాటు చేశారు.