తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Serp) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ (Payscale) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు (Finance Minister Harish Rao)ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తీరని కలగా మారిన పేస్కేల్‌ను కేసీఆర్ సర్కారు నెరవేర్చడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Serp) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ (Payscale) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు (Finance Minister Harish Rao)ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తీరని కలగా మారిన పేస్కేల్‌ను కేసీఆర్ సర్కారు నెరవేర్చడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 4 వేలమంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వంపై ఏటా రూ.42 కోట్లు అదనపు భారం పడనున్నది. సెర్ప్ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాల రూపంలో ఏటా రూ.192 కోట్లు చెల్లిస్తున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం, వారిని చైతన్యపర్చడం, బ్యాంకు రుణాలు ఇప్పించడంలో సెర్ప్ ఉద్యోగులది కీలకపాత్ర. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ప్రతి అంశంలోనూ ముందున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పే స్కేల్ (Payscale) వర్తిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్వీట్ చేస్తూ సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్(CM KCR) అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం సెర్ప్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అయిందన్నారు.