TPT: తిరుమల శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన రూ.4,000 నగదును దొంగిలించాడు. ఈ ఘటనను కమాండ్ & కంట్రోల్ సెంటర్లో సీసీటీవీ పర్యవేక్షణలో గమనించిన అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు.